అంబరాన్ని
అంటే సంబరాలు వీనులవిందు చేస్తున్నాయి. ఒక వ్యక్తి జన్మదినమునకే మనం అంత సంబరపడితే ఒక వ్యక్తి మరు జన్మిస్తే పరలోకంలో సంబరాలు మరింకెంత గొప్పగా వుంటాయో కదా!
ఒకవేళ
పరలోకపు గొప్ప సంబరాలకు నేను కూడా కారణమైతే!? ఆహా! ఎంత మధురం!! అవును నేను క్రీస్తునొద్దకు ఒక ఆత్మను నడిపించే ప్రతిసారి ఒక పండుగ పరలోకంలో అదే నా స్వంత గృహంలో జరుగుతుంది! అది తెలిసిన నేను ఏమి చేయాలి?
ఇదిగో
ఈ భూమిపై ఒక యాత్రికునిగా నేనున్నాను. నా యాత్ర నా గృహస్థులకు ఒక ఆనందదాయకం అవ్వాలి. పరలోకమనే నా స్వంత గృహంలో ఆనందం వెల్లువిరియులాగున నా బసలో పాటలు పాడుచూ నా యాత్రలో ఆత్మల పంటను కోసెదను.
నా
యజమానుడు పంట కోతకు సిద్ధంగానున్నది కాని పనివారు తక్కువగానున్నారు అని చెప్పాడు. కాని నాకు కోత కోయడం చేతకాదే!! ఎలా?
అయినా నా యజమాని తరపున పని చేయడానికి పూనుకున్నాను.
ఇప్పుడు నా యజమాని నాకు పంట ఏ విధంగా కోయాలో,
కొడవలికి ఎలా పదును పెట్టాలో,
ఏ విధంగా కూర్చాలో మరియు భద్రపరచాలో నేర్పిస్తున్నాడు.
ఓ
నాతోటి యాత్రికులారా, పనివారలారా మనమందరం కలిసి నేర్చుకొందాము రండి! మన యజమాని నుండి నైపుణ్యమును పొంది మన పరలోక గృహములను అందంగా అలంకరించెదము రండి!!!
ఇట్లు
మీ తోటి ప్రయాణికుడు
జీవన్ కిషోర్